April 3, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి తరుణంలో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా విడుదల చేస్తున్నారు ఇక ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టిన రోజు కావటం విశేషం.
ఇలా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ రాబోతుందని అభిమానులందరూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే అనుకున్న విధంగానే ఏప్రిల్ 8వ తేదీ టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారట. అయితే తాజాగా ఈ టీజర్ కి సంబంధించిన ఒక అప్డేట్ విడుదల చేస్తూ మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు.
ఇందులో భాగంగా అల్లు అర్జున్ అమ్మోరు గెటప్ లో ఉండగా ఆయన పాదానికి సంబంధించినటువంటి ఫోటోని విడుదల చేశారు. ఇక అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీ విడుదల చేయబోయే టీజర్ ఏ సమయానికి వస్తుంది అన్న విషయం గురించి క్లారిటీ తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా రాబోతున్నటువంటి పుష్ప 2 పై కూడా భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
#Pushpa2TheRule Teaser out on April 8th, 2024!!! pic.twitter.com/ivTN2CJZBh
— Allu Arjun (@alluarjun) April 2, 2024
Read More: మెంటల్ నా కొ** అంటే అర్థం తెలుసా.. మృణాల్ ను ప్రశ్నించిన రిపోర్టర్..నటి సమాధనం ఇదే?