ప్రభాస్ కి జోడిగా రష్మిక.. హిట్ గ్యారెంటీనా?

February 8, 2024

ప్రభాస్ కి జోడిగా రష్మిక.. హిట్ గ్యారెంటీనా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే .ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమా ద్వారా రాబోతున్నారు. ఈ ఏడాది చివరన రాజా సాబ్ సినిమా ద్వారా కూడా ఈయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇక ఈ సినిమాలో మాత్రమే కాకుండా ప్రభాస్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా స్పిరిట్ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్గా పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక ఛాన్స్ కొట్టేసింది అంటూ మరొక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి కావటం విశేషం ఈయన దర్శకత్వంలో రష్మిక ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఈ క్రమంలోనే రష్మికలో ఉన్నటువంటి టాలెంట్ చూసినటువంటి సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమాకి కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని భావించినట్టు తెలుస్తుంది.

ఇలా ఇప్పటికే వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ రష్మిక ఎంతో బిజీగా ఉన్నారు. పుష్ప సినిమాతో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె అనంతరం యానిమల్ సినిమా ద్వారా మంచి సక్సెస్ పొందారు. ఇక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే స్పిరిట్ సినిమాలో కూడా ఛాన్స్ వచ్చిందని వార్తలు రావడంతో ఈమె అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి రష్మిక గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Read More: ఆ మూవీలో సీతగా జాన్వీ కపూర్.. సాయి పల్లవి పక్కకు తప్పుకుందా?

ట్రెండింగ్ వార్తలు