ఇదేం అరాచకం సామీ.. ప్రభాస్ సలార్ కలెక్షన్ల సునామి

December 24, 2023

ఇదేం అరాచకం సామీ.. ప్రభాస్ సలార్ కలెక్షన్ల సునామి

Salaar Day 2 Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ కలెక్షన్ల వేట మెుదలు పెట్టింది. గత రికార్డులను ఊచకోత కోసేలా ఈ రికార్డులు ఉన్నాయనే చెప్పాలి. ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా సలార్ నిలిచింది. మొదటి రోజు 178 కోట్లు కలెక్ట్ చేయగా, రెండో రోజు సైతం అంతకు మించే రాబట్టింది. తాజాగా చిత్ర దర్శకులు సలార్ కలెక్షన్ల అందరికీ తెలియజేశారు. ఈ భారీ కలెక్షన్లు చూసి భారీ సినిమాలు తీసిన చిత్ర దర్శకులు సైతం షాక్ కు గురైనట్లు తెలుస్తోంది.

మెుగల్తూరు కుర్రాడు ప్రభాస్‌ హీరోగా సలార్ చిత్రం నిర్మించారు. ఈ మూవీలో పృథ్వీరాజ్‌ సుకుమార్‌ ముఖ్య పాత్రలో నటించారు. శృతి హాసన్‌ హీరోయిన్‌గా కీలక పాత్రలో కనిపించింది. జగపతిబాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరీరావు, ఝాన్సీ, సప్తగిరి సహా పలువురు వివిధ పాత్రలు పోషించారు.ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తీశారు. కేజీఎఫ్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ నుంచి వచ్చిన మూవీ ఇదే. కేజేఎఫ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. కాబట్టి ఈ మూవీపై మరిన్ని భారీ అంచనాలు ఫ్యాన్స్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమాను తీసి ప్రేక్షకులకు అందించారనే చెప్పవచ్చు.

కథ, సీన్ల పరంగా కొంత బోరింగ్ గా ఉన్నా యాక్షన్‌, ఎలివేషన్ల ముందు అవన్నీ దిగదుడుపుగా అయిపోయాయి. ఇక రెండు రోజుల్లోనే ఇది 3 వందల కోట్ల మార్క్(Salaar Day 2 Collections)కి చేరుకుంది. ఈ కలెక్షన్లు చూస్తుంటే ఈ సినిమా భారతీ మూవీస్ లో చాలా సినిమాల రికార్డులు చెరిపివేసేలా ఉందని అంటున్నారు. ట్రేడ్‌ వర్గాల ప్రకారం బుకింగ్‌లను బట్టి చూస్తే సోమవారం కూడా క్రిస్మస్‌ హాలిడే కావడంతో ఆ రోజూ భారీ కలెక్షన్లు ఉంటాయి. తొలి వీకెండ్‌లోనే ఈ మూవీ నాలుగైదు వందల కోట్ల మార్క్ ని దాటేయబోతుంది. ఇక వీక్‌ డేస్‌లో మరో వంద వచ్చినా ఈజీగా 500 నుంచి 600 కోట్లు దాటుతుంది. ఇక సంక్రాంతి వరకు ఈ మూవీకి తిరుగు లేదనే చెప్పాలి. మొత్తంగా భారీ వసూళ్ల దిశగా వెళ్తుందని చెప్పొచ్చు.

Read MoreGame Changer: గేమ్ చేంజర్ విడుదల.. దిల్ రాజు వల్ల అవుతుందా?

ట్రెండింగ్ వార్తలు