వేణు స్వామితో అషు రెడ్డి ప్రత్యేక పూజలు..అందుకే చేయించిందా?

February 9, 2024

వేణు స్వామితో అషు రెడ్డి ప్రత్యేక పూజలు..అందుకే చేయించిందా?

వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు. ఈయన జ్యోతిష్యుడుగా ఎంతో మంది జాతకాలను చెబుతూ పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ ఈయన ఫేమస్ అయ్యారు. సమంత నాగచైతన్య విషయంలో ఈయన చెప్పిన విధంగానే జరగడంతో ఈయన మాటలను నమ్మే వారి సంఖ్య అధికమైంది అయితే ఇటీవల కాలంలో వరుసగా సినీ సెలబ్రిటీల జాతకాలతో పాటు రాజకీయ నాయకులు జాతకాలను చెబుతూ వార్తలలో నిలిచారు.

ఇలా సెలబ్రిటీల జాతకాలు చెప్పడమే కాకుండా వారి జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడం కోసం జాతక పరిహార పూజలు కూడా చేస్తూ ఉన్నారు సెలబ్రిటీలు ప్రత్యేకంగా పూజలు చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ జాబితాలోకి నటి రష్మిక కూడా వస్తారు. రష్మిక వేణు స్వామి చేత పూజలు చేయించుకున్న అనంతరమే ఆమెకు ఇండస్ట్రీలో మంచిగా కలిసి వచ్చిందంటూ పలువురు భావిస్తూ ఉంటారు.

ఇలా వేణు స్వామిని బాగా విశ్వసించే వారిలో అషూ రెడ్డి ఒకరు. ఈమె సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున దైవ దర్శనాలకు వెళుతూ తనలో ఉన్న భక్తి భావాన్ని బయటపెట్టారు. ఇక ఈమె కూడా వేణు స్వామిని బాగా నమ్ముతారనే విషయం మనకు తెలుసు. అషు ఇదివరకే ఒకసారి వేణు స్వామి చేత పూజలు చేయించుకున్నారు. ఇటీవల ఈమె కొత్త కారుకు కూడా వేణు స్వామి పూజ చేయించారు.

ఇకపోతే తాజాగా ఈమె తన ఇంట్లో వేణు స్వామి చేత మరోసారి పూజ హోమ కార్యక్రమాలను నిర్వహించారని తెలుస్తుంది. అందుకు సంబంధించినటువంటి వీడియో అషు రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. అయితే ఈమె కెరియర్ పరంగా ఇంకా మంచి సక్సెస్ సాధించడం కోసమే ఇలా పూజలు చేయించారు అంటూ పలువురు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

Read More: అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తున్న పూజా హెగ్డే?

ట్రెండింగ్ వార్తలు